బీజేపీలో చేరిన బండ కార్తీకరెడ్డి

Arun Chilukuri
Published on: 18 Nov 2020 3:58 PM IST
బీజేపీలో చేరిన బండ కార్తీకరెడ్డి
X

గ్రేటర్ మాజీ మేయర్ బండ కార్తీక బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తనను రెండుసార్లు మోసం చేసిందని బండా కార్తీక రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 100 స్థానాలు వచ్చేలా కృషి చేస్తానన్నారు. 2023లో గోల్కొండపై బీజేపీ జెండ ఎగురడం ఖాయమని కార్తీకరెడ్డి స్పష్టం చేశారు. తాను ఏ పదవీ ఆశించడం లేదని పార్టీ అధిష్ఠానం ఏ పని అప్పగించినా చిత్తశుద్ధితో పూర్తిచేస్తానని అన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని బండా కార్తీక రెడ్డి స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story