హైదరాబాద్‌లో రూ.కోటి డబ్బు పట్టివేత.. పోలీసుల అదుపులో నిందితుడు

హైదరాబాద్‌లో రూ.కోటి డబ్బు పట్టివేత.. పోలీసుల అదుపులో నిందితుడు
x
Highlights

హైదరాబాద్‌లో హవాలా డబ్బు గుట్టురట్టైంది. పక్కాసమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్సు పోలీసులు కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

హైదరాబాద్‌లో హవాలా డబ్బు గుట్టురట్టైంది. పక్కాసమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్సు పోలీసులు కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్టుబడ్డ కోటి రుపాయల నగదు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు చెందినదిగా సీపీ ప్రకటించారు. అదేవిధంగా రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాసరావు, కారు డ్రైవర్‌ రవికుమార్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

దుబ్బాక ఉపఎన్నికల ప్రచారానికి తెరపడింది. దీంతో కొన్ని రోజులుగా గ్రామాల్లో, నగరాల్లో మోగిన మైకులు మూగబోయాయి. అటు ఎల్లుండి ఎన్నికల ప్రక్రియ జరగనుంది. ఇందుకోసం సంబంధిత అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.ఎలాగైన సిట్టింగ్‌ స్థానాన్ని తామే కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్‌, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. దీంతో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగింది. పరస్పర విమర్శనాస్త్రాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుబ్బాక దద్దరిల్లింది. ఇక పోలింగ్‌కు ఒక్క రోజు మాత్రమే ఉండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు పలు రూపాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు.

టీఆర్ఎస్ నేత సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్య సమస్యలతో ఆగస్టు నెలలో మరణించడంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి.. ఈ క్రమంలో నవంబరు 3న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్ధులను కూడా ప్రకటించాయి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పోటిలో ఉన్నారు.ఇక నవంబర్ 3 న ఎన్నికలు జరగగా 10 న ఫలితాలు రానున్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories