సోషల్ మీడియాలో కరోనాపై పుకార్లు పుట్టిస్తే కఠిన చర్యలు : హైదరాబాద్ సీపీ

సోషల్ మీడియాలో కరోనాపై పుకార్లు పుట్టిస్తే కఠిన చర్యలు : హైదరాబాద్ సీపీ
x
Covid19 Representational Photo
Highlights

కరోనాకు సంబంధించిన పలు మెసేజ్‌లతో ఫోన్లలో నిండిపోతున్నాయి. కరోనాపై లేనిపోనివి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

కరోనా దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ఇద్దరు మరణించారు. అధికారికంగా దేశంలో 100 కేసులు నమోదైయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. తెలంగాణ సర్కార్ కూడా హై అలర్ట్ ప్రకటించించింది. రాష్ట్రంలోని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. స్కూల్స్, సినిమా హాల్స్, మాల్స్ బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. పోలీస్ శాఖ సైతం అప్రమత్తమైంది.

కరోనాకు సంబంధించిన పలు మెసేజ్‌లతో ఫోన్లలో నిండిపోతున్నాయి. కరోనాపై లేనిపోనివి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ అంజని కుమార్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కరోనాపై పుకార్లు, దుష్ప్రచారం చేస్తే జాతీయ విపత్తు నిర్వహణ మండలి చట్టం 5.1 కింద పలు కేసులు నమోదు చేస్తామని సీపీ అంజని కుమార్ తెలిపారు. కరోనాపై తప్పుడు వార్తల వలన ప్రజలు భయాందోళనలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఎవరైనా తప్పడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ వైరస్ నివారణ కోసం ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఖర్చు చేయాలంటూ కేంద్ర స్పష‌్టం చేసింది. కరోనా వైరస్ సోకిన వ్యక్తిని ఎవరితోనూ కలవనీయకుండా నెలరోజుల పాటు ఆహారం,వస్త్రాలు, వైద్య సేవలు అందించేందుకు NDRF నిధులు వాడుకోవాలని కోరింది.


Show Full Article
Print Article
Next Story
More Stories