Hyderabad: హైదరాబాద్‌ను కమ్మేసిన పొగమంచు

Hyderabad Cover Dense Fog
x

Hyderabad: హైదరాబాద్‌ను కమ్మేసిన పొగమంచు

Highlights

Hyderabad: బారెడు పొద్దెక్కినా మబ్బుల చాటునే సూర్యుడు

Hyderabad: లేలేత భానుడి కిరణాలతో నింగీ, నేల అరుణవర్ణ శోభితమైంది. ఓవైపు తెల్లని పొగమంచు.. మరోవైపు రోడ్డును ఎరుపుమయం చేసిన దృశ్యం నగరవాసులకు కనువిందు చేసింది. రాష్ట్రంలో ఓ వైపు చలి తీవ్రత పెరుగుతుంటే మరో వైపు అనేక ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. నగరంలోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. పొగమంచు అందాలు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. రోడ్డుపై పరుచుకున్న మంచుదుప్పటి చూపరులకు ఆహ్లాదం కలిగిస్తోంది. దానికి తోడు చిన్న చిన్న తుంపర్లు వాహనదారులపై పడటంతో ప్రకృతి వారికి సరికొత్త అనుభూతిని పంచింది. బారెడు పొద్దెక్కినా భానుడు ఇంకా మబ్బుల చాటునే దాక్కుంటుండడంతో వాహనదారులు లైట్ల వెలుతురులోనే ప్రయాణించాల్సి వస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories