Hyderabad: సర్వోమ్యాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అరెస్ట్

Hyderabad Court Sends MD of Servomax India to ED Custody | TS News Today
x

సర్వోమ్యాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అరెస్ట్

Highlights

Hyderabad: అవసరాల వెంకటేశ్వరరావును అరెస్ట్ చేసిన ఈడీ

Hyderabad: సర్వోమ్యాక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఎండీ అవసరాల వెంకటేశ్వర రావును ఈడీ అరెస్ట్‌ చేసింది. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగవేతకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉండగా.., వివిధ బ్యాంకుల నుంచి 402 కోట్ల రుణం తీసుకున్నట్లు గుర్తించింది ఈడీ. అంతేకాదు చంద్రశేఖర్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేసింది. సర్వోమ్యాక్స్‌పై 2018లో సీబీఐ కేసు నమోదు కాగా, తీసుకున్న రుణాన్ని ఇతరత్రా అవసరాలకు దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.

అవసరాల వెంకటేశ్వరరావుపై ఈడీ ఈసీఐఆర్‌ నమోదు చేసింది. ఇక అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగించిన ఈడీ అధికారులు ఎండీ అవసరాల వెంకటే‌శ్వర రావును అరెస్ట్‌ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. అదేవిధంగా ఎండీతోపాటు మరికొంతమంది బిజినెస్‌ పార్ట్‌నర్స్‌ పేరుతో కోట్ల రూపాయల లోన్స్‌ తీసుకున్నాడనే ఆరోపణలు అవసరాల వెంకటేశ్వరరావుపై ఉన్నాయి.

వెంకటేశ‌్వర రావు కంపెనీ ఉద్యోగులను కంట్రోలింగ్‌ డైరెక్టర్‌గా నియమించినట్లు సమాచారం. షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రెజల్యూషన్‌ ప్రాసెస్‌ ద్వారా బోగస్‌ జనరల్‌ ఎంట్రీలను క్రియేట్‌ చేసినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా.. 50కిపైగా వెబ్‌సైట్స్‌ ఉపయోగించి మనీ ట్రాన్స్‌ఫర్స్‌ జరిపినట్లు సమాచారం. మొత్తానికి అధిక ధరలకు గూడ్స్‌ కొనుగోలు చేసి డాక్యుమెంట్స్‌ తయారు చేసినట్లు ఈడీ గుర్తించింది.

మొత్తానికి బినామీ పేర్లతో లోన్‌ అమౌంట్‌ను ఎండీ వెంకటేశ్వర రావు తన అకౌంట్‌లో జమ చేసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. కుట్రపూరితంగానే బ్యాంకులకు 267 కోట్ల రూపాయలను నష్టం కల్గించినట్లు గుర్తించిన ఈడీ అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చింది. దీంతో అవసరాల వెంకటేశ్వరరావుకు కోర్టు 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories