
మొదటి సారి ఫ్లైఓవర్ పై ప్రమాదం జరిగినపుడు కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా మూసి తరువాత మళ్లీ పునరుద్ధరించారు.
గత సంవత్సరం నవంబర్ 3న కేటీఆర్ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై అదే నెల 23 నుంచి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే మొదటి సారి ఫ్లైఓవర్ పై ప్రమాదం జరిగినపుడు కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా మూసి తరువాత మళ్లీ పునరుద్ధరించారు. తరువాత సరిగ్గా మొదటి సారి ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే భారీ ప్రమాదం జరిగింది. ఓ కారు ప్లైఓవర్ పైనుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ చనిపోగా మరో నాలుగురికి తీవ్రగాయాలైయ్యాయి. దీంతో ఈ ఫ్లై ఓవర్ కు తాత్కాలికంగా మూసివేశారు. అంతే కాకుండా ప్లై ఓవర్ నిర్మాణాన్ని పరిశీలించారు.
అయితే మళ్లి తిరిగి నగర మేయర్ బొంతు రామ్మోహనరావు దీనిని ప్రారంభించారు. ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు ప్రయాణించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపారు. అంతే కాక కొన్ని నిబంధనలను కూడా ప్రవేశపెట్టారు. ఫ్లైఓవర్‌పై సెల్ఫీలు తీసుకోవడాన్న నిషేధించారు. స్పీడ్ లిమిట్ కూడా అమలు చేశారు. రాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించినందుకు కఠినమైన శిక్షలు విధించాలని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వ్యక్తులను గుర్తించడానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (పిఎఎస్), నిఘా కెమెరాలను, స్పీడ్ డిటెక్షన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.
కాగా.. కఠినమైన నియమ నిబంధనలు ఉన్నప్పటికి వాహనదారులు వాటిని ఉల్లంఘింస్తున్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వివరాల ప్రకారం, 2020 జనవరి 5 న 87 కేసులు నమోదైయ్యాయని పేర్కొన్నారు. ఫ్లైఓవర్ తిరిగి ప్రారంభించిన 24 గంటల్లో ఉల్లంఘనలు 74 కేసులు నమోదైయ్యాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు మరోసారి వాహనదారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంహించిన వారిని పోలీసులు గమనిస్తున్నారని, నిబంధనలు పాటించండి సురక్షితంగా ప్రయాణం చేయండి. రాష్ డ్రైవింగ్, హెల్మెట్, స్పీడ్ లిమిట్, వంటి రూల్స్ పాటించాలని, లేదంటే పలు సెక్షన్ల కేసులు తప్పవని పోలీసులు మరోసారి హెచ్చిరించారు.
పోలీసులు విధించిన నిబంధనలు, సూచనల విషయానికొస్తే ద్విచక్ర వాహన దారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. లేని పక్షంలో చలానా విధిస్తామని తెలిపారు. అంతే కాకుండా ద్విచక్ర వాహనదారులు ఎడమ వైపు లేన్‌లో మాత్రమే వెళ్లాలని సూచించారు. ఒక వేల ఎక్కువ వేగంలో వెలుతూ కుడి వైపు లైన్ దాటినా, ఫ్లైఓవర్ పైన వాహనాలను ఆపినా సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా చలానా విధించనున్నారు.
Cyberabad traffic police watching you. Follow Traffic rules and stay safe. pic.twitter.com/NTxFg9skkA
— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) January 6, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




