డ్రగ్స్ డెన్‌గా హైదరాబాద్ మారిందా..?

Hyderabad Based Drugs Supply Abroad | Telugu News
x

డ్రగ్స్ డెన్‌గా హైదరాబాద్ మారిందా..? 

Highlights

*హైదరాబాద్ కేంద్రంగా విదేశాలకు డ్రగ్స్ సరఫరా

Drugs: హైద‌రాబాద్ నగరం డ్రగ్స్ డెన్ గా మారిందా..? విదేశాలకు సైతం హైద్రాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరుగుతుందా.?? తాజాగా ఆశిష్ జైన్ నివాసంపై ఎన్ సీబీ అధికారుల దాడులతో మరోసారి డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

అమెరికాతో పాటు ప‌లు దేశాల‌కు చెందిన వారి వినోదం, అవ‌స‌రాల కోసం ఇంట‌ర్నెట్ ఫార్మసీ ద్వారా హైదరాబాద్​ నుంచి ఔష‌ధాల రూపంలో డ్రగ్స్ పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో నిందితుడు ఆశిష్ జైన్ నుంచి డ్రగ్స్​తో పాటు 3.71 కోట్ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్​ కొనుగోలుదారుల నుంచి ఆశిష్​ జైన్​ ప‌లు ర‌కాల లావాదేవీలతో పాటు బిట్ కాయిన్లు ఆన్ లైన్ పేమెంట్ తీసుకుంటున్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు.

విదేశాల‌కు నిషేధిత డ్రగ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్నారని.. హైద‌రాబాద్ కేంద్రంగా ఈ గుట్టు సాగుతోందని ఎన్సీబీ అధికారులకు స‌మాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందాలు హైద‌రాబాద్​లోని దోమ‌లగూడలో ఆశిష్​ ఇంటిపై దాడులు నిర్వహించారు. జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో ఆశిష్​ జైన్ ఈ దందా చేస్తున్నట్లు గుర్తించారు. అత‌ని వ‌ద్ద నుంచి భారీగా నిషేధిత ఔష‌ధాలతో పాటు వాటి ద్వారా సంపాదించిన 3కోట్ల 71లక్షల న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో మొబైల్ ఫోన్ ల్యాప్ టాప్​లు, మరికొన్ని ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు.

అమెరికాతో పాటు, పలు దేశాల‌కు సైకోట్రోపిక్​లో నిషేధిత ఆక్సికోడోన్, హైడ్రోకోడోన్, ఆల్పాజోలాం, డ‌యాజెపమ్, లోరాజెప‌మ్, క్లోన‌జెప‌మ్, జోల్పిడ‌మ్, ట్రమొడాల్ వంటి ఔష‌ధాలను.. ఆర్డర్లపై స‌ర‌ఫ‌రా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మెయిల్, ఇంటర్నెట్ వాయిస్ కాల్స్​తో విదేశీయుల నుంచి ఆర్డర్లు తీసుకుంటున్నారు. జేఆర్​ ఇన్ఫినిటీ పేరుతో ఖాతా తెరిచి.. ముందుగా పేమెంట్ చేయించుకున్నాడు. క్రెడిట్ కార్డ్, పేపాల్​తో పాటు బిట్ కాయిన్లను కూడా అనుమ‌తిస్తున్నాడు. డబ్బులు అంద‌గానే అత్యవసర ఔష‌ధాల పేరుతో నిషేధిత డ్రగ్స్​ను.. ఎయిర్ కార్గో, షిప్​మెంట్​ల ద్వారా సంబంధిత చిరునామాకు కొరియ‌ర్ చేస్తున్నాడు. ఆశిష్‌జైన్‌ ఇప్పటివరకు వెయ్యికిపైగా డ్రగ్‌ పార్సిళ్లను అమెరికాలోని పలుచోట్లకు పంపినట్లు ఎన్‌సీబీ అధికారులు గుర్తించారు. ఈ అంతర్జాతీయ డ్రగ్స్‌ రవాణా ముఠాకు ఆశిష్‌ జైన్‌ సూత్రధారి అని గుర్తించారు.

ఆశిష్‌ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న డిజిటల్‌ ఆధారాలను ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఎక్కడి నుంచి డ్రగ్స్‌ తెచ్చాడు, దేశంలో ఎక్కడెక్కడ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేశాడు. ఎక్కడెక్కడి నుంచి రవాణా చేశాడన్న వివరాలను గుర్తిస్తున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు , నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వివిధ బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు.

గ‌త రెండేళ్లలో ఆశిష్​ జైన్​ వెయ్యికి పైగా కొరియ‌ర్లను భార‌త్ నుంచి అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఈ సైకోట్రోపిక్ డ్రగ్స్​ను పంపించినట్లు ఎన్సీబీ విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులు.. విచార‌ణ‌లో మ‌రికొంత మందిని అరెస్ట్ చేసే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories