hyderabad also toddler trafficking case : హైదరాబాద్ లో కూడా యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ మోసాలు.. మహిళ ఫిర్యాదు

hyderabad also toddler trafficking case : హైదరాబాద్ లో కూడా యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ మోసాలు.. మహిళ ఫిర్యాదు
x
Highlights

విశాఖలో ఆస్పత్రి ముసుగులో పసికందులతో వ్యాపారం సాగించిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ మోసాలు హైదరాబాద్ లో కూడా బయటపడుతున్నాయి.. సరోగసీ ...

విశాఖలో ఆస్పత్రి ముసుగులో పసికందులతో వ్యాపారం సాగించిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ మోసాలు హైదరాబాద్ లో కూడా బయటపడుతున్నాయి.. సరోగసీ విధానంలో సంతానం అందజేస్తామని మోసం చేశారంటూ జూబ్లీహిల్స్ కి చెందిన దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దాంతో ఆసుపత్రి పై మరో కేసు నమోదయింది. జూబ్లీహిల్స్‌కు చెందిన దంపతులకు పిల్లలు లేకపోవడంతో సరోగసీ ద్వారా సంతానం పొందాలని భావించారు. దాంతో గత ఏడాది నవంబర్‌ 11న సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను సంప్రదించారు..

ఆసుపత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల‌ నమ్రత సరోగసీ విధానం ద్వారా ఆ దంపతులకు శిశువును అందజేస్తామని నమ్మించి ముందుగా రూ.10 లక్షలు తీసుకున్నారని.. ఈ ఏడాది అక్టోబరులో శిశువును ఇవ్వాల్సి ఉందని.. ఇందుకు సంబంధించి సరోగసీ మహిళ కూడా విశాఖపట్టణంలో ఉంటూ చికిత్స పొందుతుందని వైద్యురాలు తెలిపారని అన్నారు. అయితే విశాఖపట్నంలో

ఇటీవల యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ ఆసుపత్రిలో శిశు విక్రయాల మోసాలను ఇటీవల పోలీసులు బట్టబయలు చేశారు. దాంతో ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ కు చెందిన దంపతులు.. తమను కూడా ఇలాగే మోసం చేస్తున్నట్లు గ్రహించారు. దాంతో ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుంటే సృష్టి యూనివర్సల్ ఆసుపత్రి పసిపిల్లల ఆక్రమ రవాణా కేసుపై నమ్రతను పోలీసులు కస్టడీకి కొరుతూ పోలీసులు పిటిషన్ వేశారు.. ప్రస్తుతం కేజీహెచ్ లో నమ్రత చికిత్స పొందుతోంది..కాగా మొత్తం 56 ప్రసవాలకు సంభందించిన రికార్డులు, డాక్యుమెంట్ లను పోలీసులు పరిశీలించారు.. 56 మంది పిల్లలు ఎక్కడ ఉన్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories