దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణం: సెల్లార్‌ నీటిలో మునిగి బాలుడి మృతి

Arun Chilukuri
Published on: 14 Oct 2020 7:01 PM IST
దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణం: సెల్లార్‌ నీటిలో మునిగి బాలుడి మృతి
X

హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ సాహితీ అపార్ట్ మెంట్ లో దారుణం చోటుచేసుకుంది. సెల్లార్ నీటిలో అజిత్ సాయి అనే 3ఏళ్ల బాలుడు పడి చనిపోయాడు.నిన్న కురిసిన భారీ వర్షానికి అపార్ట్ మెంట్ సెల్లర్ లోకి భారీగా వరద నీరు చేరుకుంది. ఉదయం బాబు ఆడుకుంటూ కిందకు వెళ్లి నీటిలో పడిపోయాడు. ఆలస్యంగా గమనించిన తండ్రి యుగేందర్ బాబుని బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాధిత బాలుడిని పరిశీలించి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story