MMTS Trains: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. రేపు 36 ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులు రద్దు

MMTS Trains Cancelled: హైదరాబాద్ నగరవాసులకు ముఖ్య సూచన. ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.

Arun Chilukuri
Published on: 16 Jan 2022 3:38 PM IST
Hyderabad: 36 MMTS Trains Cancelled
X

MMTS Trains: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. రేపు 36 ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులు రద్దు

MMTS Trains Cancelled: హైదరాబాద్ నగరవాసులకు ముఖ్య సూచన. ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. నగరంలో లోకల్ ట్రైన్స్(ఎంఎంటీఎస్) సేవలను రద్దు చేసినట్లు వెల్లడించింది. సోమవారం సికింద్రాబాద్‌ పరిధిలో 36 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సాంకేతిక కారణాలు, ట్రాక్‌ మరమ్మతుల నిమిత్తం ఈ సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం 79 సర్వీసులకు 36 సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది.

రద్దు చేసిన సర్వీసులు ఇవే..

లింగంపల్లి - హైదరాబాద్‌ (9 సర్వీసులు)

హైదరాబాద్‌ - లింగంపల్లి (9 సర్వీసులు)

ఫలక్‌నుమా - లింగంపల్లి (8 సర్వీసులు)

లింగంపల్లి - ఫలక్‌నుమా (8 సర్వీసులు)

సికింద్రాబాద్‌ - లింగంపల్లి (1 సర్వీసు)

లింగంపల్లి - సికింద్రాబాద్‌ (1 సర్వీసు)

Arun Chilukuri

Arun Chilukuri

Next Story