బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన హూజూర్ నగర్ ఉపఎన్నికల ఫలితాలు..

బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన హూజూర్ నగర్ ఉపఎన్నికల ఫలితాలు..
x
Highlights

తెలంగాణలో ప్రత్యామ్నాయ తామే అని భావిస్తున్న బీజేపీకి హూజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితాలు బిగ్ షాక్ ఇచ్చాయి. దక్షిణాదిపై కన్నేసిన బీజేపీ అధిష్టానం అందుకు...

తెలంగాణలో ప్రత్యామ్నాయ తామే అని భావిస్తున్న బీజేపీకి హూజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితాలు బిగ్ షాక్ ఇచ్చాయి. దక్షిణాదిపై కన్నేసిన బీజేపీ అధిష్టానం అందుకు తగ్గట్టుగా పావులు కదిపింది. లోక్ సభఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్, టీడీపీకి చెందిన నేతలను తమవైపు తిప్పుకోవడంలో చాలావరకు సక్సెస్ సాధించింది. తెలంగాణలో బీజేపీ బలపడుతుందన్న సంకేతాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తం అయ్యాయి. హుజూర్ నగర్ లో విజయం సాధించకపోయినా గట్టి పోటీ ఇస్తామని బీజేపీ శ్రేణులు భావించారు. కానీ వాస్తవ ఫలితాలు మాత్రం బీజేపీ అధిష్టానాన్ని సైతం కోలుకోకుండా చేశాయి.

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి ఉత్సాహంతో ఉన్న బీజేపీ నేతలు ఇక ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు మాదే అని చెబుతూ వచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా పార్టీ రాష్ర్ట నేతలతు దిశా నిర్దేశం చేస్తూ వచ్చారు. అంతే కాదు కాంగ్రెస్ బలహీనపడటంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని ప్రకటించుకున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీకి చెందిన పలువురు నేతలకు కాషాయ కండువకప్పి పార్టీలో చేర్చుకున్నారు. హూజూర్ నగర్ ఉపఎన్నికల్లో గౌరవప్రదమైన సంఖ్యలో ఓట్లు సాధించి ప్రజల్లో నమ్మకం కల్గించాలని పార్టీ అధిష్టానం భావించింది. అదే ఊపుతో ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని పోటీకి నిలిపారు. తీరా ఫలితాలు విశ్లేషిస్తే టీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారన్నది స్పష్టం అయ్యింది. టీఆర్ఎస్ అభ్యర్ధి విజయం సాధించగా రెండో స్థానంలో కాంగ్రెస్ ఉండగా స్వతంత్ర్య అభ్యర్ధి మూడో స్థానంలో నిలిచారు. కనీసం పదివేల ఓట్లైనా వస్తాయని భావించిన బీజేపీ అభ్యర్ధి కేవలం 2621 ఓట్లకే పరిమితం అయ్యి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీ చేసిన సంపావత్ సుమన్ 2693 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

ఇంతటి ఘోర ఓటమికి అనేక కారణాలున్నాయంటూన్నారు బీజేపీ నేతలు. ముందస్తు ప్రణాళిక లేకుండా ఎన్నికల బరిలో దిగడం అభ్యర్ధిని ఆలస్యంగా ప్రకటించడాన్నికమలం పార్టీ లీడర్లు అంతర్గతంగా చెబుతున్నప్పటికీ లోకల్ సెంటిమెంట్ కూడా పార్టీకి నష్టం చేసిందంటున్నారు. ఈ ఫలితం నేపధ్యంలో బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందో అన్నది వేచి చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories