Huzurabad: స్థానికేతర వ్యక్తులు నియోజకవర్గాన్ని ఖాళీ చేయాలి- సీపీ

Huzurabad: హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం ముగిసింది.

Arun Chilukuri
Published on: 27 Oct 2021 8:12 PM IST
Huzurabad: స్థానికేతర వ్యక్తులు నియోజకవర్గాన్ని ఖాళీ చేయాలి- సీపీ
X

Huzurabad: స్థానికేతర వ్యక్తులు నియోజకవర్గాన్ని ఖాళీ చేయాలి- సీపీ

Huzurabad: హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం ముగిసింది. స్థానికేతర వ్యక్తులు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోవాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్సై, 2వేల మంది సిబ్బందితో పాటు 22 కంపెనీల కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు, సీపీ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సత్యనారాయణ.

ఉప ఎన్నిక ప్రచారం సమాప్తం కావడంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా నిశబ్ధం అలుముకున్నది. ప్రతి ఎన్నికకు 48 గంటల ముందు నిలిపి వేసే ప్రచారాన్ని ఈ ఎన్నికల్లో మాత్రం 72 గంటల ముందు నిలిపి వేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేంద్ర బలగాలు కూడా తోడవడంతో ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story