Huzurabad By-Election Result: మూడవ రౌండ్ లో బిజేపి ఆధిక్యం

* మూడవ రౌండ్ లో బిజేపి ఆధిక్యం

Shilpa
Published on: 2 Nov 2021 10:42 AM IST
Huzurabad By Election Third Round Result Released
X

మూడవ రౌండ్ లో బిజేపి ఆధిక్యం(ఫైల్ ఫోటో)  

Huzurabad By-Election Result: కరీంనగర్‌లోని ఎస్‌ఆర్ఆర్ కాలేజీలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కౌంటింగ్ కోసం అధికారులు రెండు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్లో 14 చొప్పున టేబుళ్లను సిద్ధం చేశారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపును పూర్తి చేయనున్నారు.

హుజురాబాద్ బై పోల్ మొదటి రెండు రౌండ్ లలో కలిపి బిజేపి అభ్యర్ధి ఈటెల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక మూడవ రౌండ్ లో కూడా బిజేపి అభ్యర్ధి ఈటెల రాజేందర్ 9,461 ఓట్లతో ఆధిక్యం లో ఉండగా, అధికార పార్టీకి 9,103 ఓట్లు, కాంగ్రెస్ 339 ఓట్లతో వెనుకంజలో ఉన్నాయి. మరి కాసేపట్లో నాల్గవ రౌండ్ ఫలితాలు విడుదల కానున్నాయి.

Shilpa

Shilpa

Next Story