Huzurabad By-Election Result: నాల్గవ రౌండ్ లో బిజేపి ఆధిక్యం

* నాల్గవ రౌండ్ లో బిజేపి అభ్యర్ధి ఈటెల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు

Shilpa
Published on: 2 Nov 2021 10:58 AM IST
Huzurabad By Election Fourth Round Result Released
X

నాల్గవ రౌండ్ లో బిజేపి అభ్యర్ధి ఈటెల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు(ఫోటో- ది హన్స్ ఇండియా)    

Huzurabad By-Election Result: కరీంనగర్‌లోని ఎస్‌ఆర్ఆర్ కాలేజీలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కౌంటింగ్ కోసం అధికారులు రెండు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్లో 14 చొప్పున టేబుళ్లను సిద్ధం చేశారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపును పూర్తి చేయనున్నారు.

హుజురాబాద్ బై పోల్ మొదటి మూడు రౌండ్ లలో బిజేపి అభ్యర్ధి ఈటెల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక నాల్గవ రౌండ్ లో కూడా బిజేపి అభ్యర్ధి ఈటెల రాజేందర్ 13,525 ఓట్లతో ఆధిక్యం లో ఉండగా, అధికార పార్టీకి 12,262 ఓట్లు, కాంగ్రెస్ 339 ఓట్లతో వెనుకంజలో ఉన్నాయి. మరి కాసేపట్లో ఐదవ రౌండ్ ఫలితాలు విడుదల కానున్నాయి.

Shilpa

Shilpa

Next Story