Hyderabad: కానిస్టేబుల్‌ శిక్షణ పూర్తి చేసుకుని ఇంటి వచ్చిన భార్యకు భర్త ఘన స్వాగతం

Hyderabad: భర్త ఇచ్చిన సర్‌ప్రైజ్‌ ఆనందబాష్పాలు రాల్చిన భార్య

Shekhar G
Published on: 22 July 2023 11:31 AM IST
Husband Gives A Warm Welcome To The Wife Who Has Come Home After Completing Her Constable Training
X

Hyderabad: కానిస్టేబుల్‌ శిక్షణ పూర్తి చేసుకుని ఇంటి వచ్చిన భార్యకు భర్త ఘన స్వాగతం

Hyderabad: మహిళా కానిస్టేబుల్‌ ఏడాదిన్నర పసిబిడ్డను వదిలి పోలీస్‌ శిక్షణకు వెళ్లాల్సి వచ్చింది. 45 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు శిక్షణ పూర్తి చేసుకొని హెడ్‌కానిస్టేబుల్‌గా ఇంటికి తిరిగొచ్చింది. భార్య ఇంటికి తిరిగొస్తుంటే మామూలుగా ఉండొద్దని అనుకున్నాడా భర్త. తీన్మార్‌ డ్యాన్సులు, బాజాభజంత్రీలు పెట్టించి, పటాకులు కాల్చి, అర్ధాంగికి అపూర్వ స్వాగతం పలికి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. దీంతో భర్త ప్రేమకు ఆమె ఉబ్బితబ్బిబ్బై ఆనందబాష్పాలు రాల్చింది.

హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే కంపాడీనా.. ఎర్రగడ్డలోని ప్రేమ్‌నగర్‌లో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. భర్త రోనాల్డ్‌ బాసిల్‌ సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఏడాదిన్నర కుమారుడు అశర్‌ ఉన్నాడు. డీనాకు ఇటీవలే హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించింది. దీంతో 45 రోజుల పాటు కరీంనగర్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు వెళ్లింది. శిక్షణ పూర్తయ్యి ఇంటికి వస్తుండటంతో ఆమెకు వెరైటీగా గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పాలని.. అంబరాన్నంటేలా సంబురాలు చేశాడు. డీనా ఇంట్లో అడుగుపెట్టాక కేక్‌కట్‌ చేయించి తినిపించాడు.

Shekhar G

Shekhar G

Next Story