Bhadradri Kothagudem: రెడ్​హ్యాండెడ్​గా దొరికిన భర్త... దేహశుద్ధి చేసిన భార్య

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ బాగోతం బయటపడింది.

Arun Chilukuri
Published on: 5 Aug 2021 4:04 PM IST
Husband Beaten by Wife in Bhadradri Kothagudem
X

Bhadradri Kothagudem: రెడ్​హ్యాండెడ్​గా దొరికిన భర్త... దేహశుద్ధి చేసిన భార్య

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ బాగోతం బయటపడింది. ప్రేమ వివాహం చేసుకొని పాప పుట్టిన తర్వాత ముఖం చాటేసి మరో యువతితో వివాహేతర సబంధం పెట్టుకున్నాడు గడ్డం రాజేష్‌. మరో యువతితో కలిసి ఉండగా మహిళా సంఘాలతో కలిసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య భర్త రాజేష్‌ను చితకబాదింది. అనంతరం పోలీసులకు అప్పగించింది.

పాల్వంచ 6వ బెటాలియన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాజేష్‌ 2వేల 11లో మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన స్వప్నను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఆరేళ్ల పాప కూడా ఉంది. అయితే సాఫీగా సాగుతున్న కాపురంలో ఒక్కసారిగా విభేదాలు చోటుచేసుకున్నాయి. రాజేష్‌ ప్రతిరోజు స్వప్నను తిట్టడం, ఇష్టానుసారంగా కొట్టడం లాంటివి ప్రారంభించాడు. కొన్నిరోజులకు ఇంటి నుంచి బయటకు కూడా గెంటేశాడు. దీంతో బాధితురాలు స్వప్న పోలీసులను ఆశ్రయించి, కేసు పెట్టింది. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది.

ఇదిలా ఉంటే కేసు ఓ కొలిక్కి రాకముందే గడ్డం రాజేష్‌ బొల్లొరిగూడెంలో మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొని, సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్వప్న పక్కా ప్లాన్‌తో మహిళా సంఘాలతో రెడ్‌ హ్యాండెడ్‌గా రాజేష్‌ను పట్టుకుంది. అతడితో పాటు తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని చితకబాదింది. రాజేష్‌కు మరికొంతమందితో వివాహేతర సంబంధం ఉన్నట్టు ఆరోపించింది. తన జీవితాన్ని నాశనం చేశాడంటూ కన్నీళ్లు పెట్టుకుంది. రాజేష్‌ను కఠినంగా శిక్షించాలంటూ పోలీసులను డిమాండ్‌ చేసింది బాధితురాలు స్వప్న.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story