మునుగోడు ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ శాతం.. ప్రధాన పార్టీల్లో టెన్షన్..

Huge Polling in Munugodu Bypoll 2022
x

మునుగోడు ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ శాతం.. ప్రధాన పార్టీల్లో టెన్షన్..

Highlights

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ శాతం నమోదవుతోంది.

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ శాతం నమోదవుతోంది. మధ్యాహ్నం 3గంటల సమయానికే 59.92 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. ఇప్పటికీ పలు పోలింగ్ కేంద్రాల్లో భారీ క్యూలైన్‌లు కనబడుతున్నాయి. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో 91శాతం పోలింగ్ నమోదయింది. ఈసారి మునుగోడు ఉప ఎన్నికలో పోలింగ్ శాతం పెరగడం చూస్తే గత రికార్డులను బ్రేక్ చేసి, భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పోలింగ్ శాతం పెరగడంతో ప్రధాన పార్టీల్లో టెన్షన్ నెలకొంది. మరికాసేపట్లో పోలింగ్ గడువు ముగియనుంది. దీంతో అనూహ్యంగా పెరుగుతున్న పోలింగ్ శాతం ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అనే చర్చ మొదలైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories