Hyderabad: హైదరాబాద్‌లో భారీగా హవాలా నగదు పట్టివేత

Hyderabad: గాంధీనగర్‌ పీఎస్‌ పరిధిలో రూ.3.5 కోట్లు స్వాధీనం

Jyothi
Published on: 11 Oct 2022 2:06 PM IST
Huge Hawala Cash Seized in Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో భారీగా హవాలా నగదు పట్టివేత

Hyderabad: హైదరాబాద్‌లో భారీగా హవాలా నగదు పట్టుబడింది. గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి హోటల్‌ మారియట్‌ దగ్గర నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. రెండు స్విఫ్ట్‌ డిజైర్‌ కార్లను తనిఖీ చేసి, మూడున్నర కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు చూపించకపోవడంతో.. పట్టుబడ్డ డబ్బును గాంధీనగర్‌ పీఎస్‌ తరలించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రెండు కార్లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story