HMDA: రికార్డు స్థాయి ధర పలికిన కోకాపేట భూములు.. ఎక‌రం ధర ఎంతంటే..?

Kokapeta Lands: రెండో విడత కోకాపేట నియోపోలీస్‌ భూముల వేలం కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 3 Aug 2023 4:34 PM IST
Huge Demand For Kokapet Neopolis Lands In HMDA Auction
X

HMDA: రికార్డు స్థాయి ధర పలికిన కోకాపేట భూములు.. ఎక‌రం ధర ఎంతంటే..?

Kokapeta Lands: రెండో విడత కోకాపేట నియోపోలీస్‌ భూముల వేలం కొనసాగుతోంది. కోకాపేట భూముల్లోని నియోపోలీస్‌ లే అవుట్‌లోని 6,7,8,9 ప్లాట్లకు గురువారం వేలం వేసింది హెచ్‌ఎండీఏ. ఈ వేలంలో భూములు రికార్డు స్థాయి ధర పలుకుతున్నాయి. కోకాపేటలో అత్యధికంగా ఎకరం 75 కోట్ల 25 లక్షలు పలికింది. ప్లాట్‌ నెంబర్‌ 9లోని ఎకరం భూమి విలువ 75 కోట్ల 25 లక్షలు పలికింది. ప్లాట్‌ నెం.9లో మొత్తం 3.6 ఎకరాల భూమికి ఈ వేలం పాట జరిగింది. 9వ ప్లాట్‌ వేలంతోనే మొత్తంగా రూ.275.4 కోట్లు వచ్చాయి. ఇక 6,7,8 ప్లాట్‌లలో ఈ-ఆక్షన్‌ కొనసాగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story