TS Group 1 Posts: గ్రూప్‌ వన్‌లో 19 కేటగిరీల ఉద్యోగాలు.. ఒక్కో పోస్టుకి అర్హతలు ఏంటి..?

How Many Categories of Jobs in Group One What are the Qualifications for Each Post
x

TS Group 1 Posts: గ్రూప్‌ వన్‌లో 19 కేటగిరీల ఉద్యోగాలు.. ఒక్కో పోస్టుకి అర్హతలు ఏంటి..?

Highlights

TS Group 1 Posts: తెలంగాణ నిరుద్యోగుల ఆశలు ఫలించాయి. ఎట్టకేలకు టీఎస్పీఎస్సీ గ్రూప్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

TS Group 1 Posts: తెలంగాణ నిరుద్యోగుల ఆశలు ఫలించాయి. ఎట్టకేలకు టీఎస్పీఎస్సీ గ్రూప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 19 రకాల పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే గ్రూప్ వన్‌లో ఇంటర్వ్యులను రద్దు చేసిన విషయం తెలిసిందే.. గ్రూప్-1లో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. 900 మార్కులకి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. అయితే ఇందులో ఒక్కో పోస్టుకి ఒక్కో విద్యార్హతల గురించి తెలియజేశారు. వాటి గురించి తెలుసుకుందాం.

మొత్తం 503 పోస్టుల్లో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, సీటీఓ, డీపీఓ, జిల్లా రిజిస్ట్రార్, సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్, పురపాలక కమిషనర్లు, బీసీ, ఎస్టీ సంక్షేమ అధికారులు, ఉపాధి అధికారి, ఏఓ, ఎంపీడీఓ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. ఇక డీఎస్పీ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న పురుషులు 167.6 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. ఛాతి కొలత 86.3 సెం.మీ ఉండాలి. అలాగే మహిళలు 152.5 సెంటీమీటర్ల ఎత్తు, 45.5 కిలోల బరువు ఉండాలి.

సాంఘీక సంక్షేమ ఏడీ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సోషియాలజీ, సామాజిక సేవలో డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. సహాయ ట్రెజరీ అధికారి పోస్టులకు కామర్స్/ఎకనామిక్స్/మాథ్స్ సబ్జెక్టుల్లో డిగ్రీ చేసి ఉండాలి. సెకండ్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించి ఉంటే సరిపోతుంది. ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులకు మెకానికల్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పాసై ఉండాలి.

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్టుకు ఏదైనా డిగ్రీ పాసై ఉంటే చాలు. కార్మిక సంక్షేమానికి సంబంధించిన సోషల్ వర్క్‌లో పీజీ చేసిన దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ వన్ అభ్యర్థులు అప్లై చేసుకునేముందు ఈ విషయాలు గమనిస్తే మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories