గొర్రెలకు హాస్టల్స్... ఎక్కడో తెలుసా..?

Hostels for Sheep in Siddipet
x

గొర్రెలకు హాస్టల్స్... ఎక్కడో తెలుసా..?

Highlights

గొర్రెలకు హాస్టల్స్... ఎక్కడో తెలుసా..?

Hostels for Sheep: విద్యార్థులకు హాస్టల్స్ ఉంటాయి. ఉద్యోగులకు,ఉద్యోగార్థులకు కూడా హాస్టల్స్ ఉంటాయి కానీ..గొర్రెలకు హాస్టల్స్ ఉండడం మీరెప్పుడైనా చేశారా? ఈ మాట నమ్మశక్యంగా లేదా? ఇది నిజం. గొర్రెలకు సైతం హాస్టల్స్ ఉన్నాయి. వాటిని క్షేత్రస్థాయిలో చూడాలని ఉందా? అయితే మీరు సిద్దిపేట జిల్లాకు రావాల్సిందే.

గొర్రెల కాపరుల ఆర్థికాభివృద్ధి, గ్రామాల్లో పారిశుద్ధ్యం పెంపొందించాలన్నా ఉద్దేశ్యంతో సిద్దిపేట జిల్లాలో గొర్రెల హాస్టల్‌కు అంకురార్పణ చేశారు. మంత్రి హరీష్ ఆలోచన మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, పశు సంవర్దక శాఖ అధికారులు గొర్రెల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ స్థలాలు , గొర్రె కాపరుల సొసైటీ స్థలాలలో హాస్టళ్లను ఏర్పాటు చేశారు.

ఇర్కోడ్, నర్మెట్ట, ఇబ్రహీం‌పూర్, జక్కాపూర్, గంగాపూర్, మిట్టపల్లి గ్రామాలలో గొర్రెల హాస్టళ్లు ఏర్పాటు చేసి వినియోగంలోకి తెచ్చారు. అలాగే అక్కనపల్లి, గట్ల మల్యాల, పుల్లూరు, బుస్సాపూర్, లక్ష్మీ దేవి పల్లి గ్రామాలలో గొర్రెల హాస్టల్ లు సిద్ధమయ్యాయి. ఒక్కో హాస్టల్లో 8 నుంచి 45 వరకూ గొర్రెల షెడ్లు ఉన్నాయి. ఒక్కో షెడ్ లో గరిష్టంగా వంద గొర్రెలు ఉండేలా అధికారులు వసతులు ఏర్పాటు చేశారు.

గొర్రెలు బయటకి పోకుండా బయట ఉండే కుక్కలు, తోడేళ్లు దాడులు చేయకుండా షెడ్ల చుట్టూ ప్రవారీ గోడలను నిర్మించారు. ప్రతి షెడ్‌కు నీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించారు. గొర్రెలను రాత్రి వేళలో పర్యవేక్షించేందుకు వీలుగా ప్రత్యేకంగా విశ్రాంతి గదిని నిర్మించారు. ఈ సందర్బంగా గొర్రెల పెంపకం దార్లు మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. తమ ఆర్థిక అభివృద్ధికి గొర్రెలు మంజూరు చేసి వాటి రక్షణ కి షేడ్లు నిర్మించడంతో సంతోషంగా ఉందంటున్నారు గొర్ల పెంపకం దారులు.


Show Full Article
Print Article
Next Story
More Stories