భువనగిరిలో పరువు హత్య.. కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా అనుమానం...

భువనగిరిలో పరువు హత్య.. కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా అనుమానం...
x

భువనగిరిలో పరువు హత్య.. కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా అనుమానం...

Highlights

Bhuvanagiri: రెండు రోజుల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ పిలిపించిన కిడ్నాపర్లు...

Bhuvanagiri: అదృశ్యమైన సస్పెండెడ్‌ హోంగార్డు రామకృష్ణ మృతదేహం లభ్యమైంది. సిద్దిపేట జిల్లా కుక్కునూర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రామకృష్ణ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే మృతుడిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రామకృష్ణది పరువు హత్యగా భావిస్తున్న పోలీసులు భార్య మేనమామ వెంకటేష్‌ కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు.

యాదగిరిగుట్టకు చెందిన భార్గవి వలిగొండ మండలంలోని లింగరాజుపల్లి చెందిన రామకృష్ణ 2020 ఆగస్టు 16 ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నిరోజుల పాటు లింగరాజుపల్లిలో ఉన్న రామకృష్ణ దంపతులు భార్గవి ప్రెగ్నెన్సీ రావడంతో భువనగిరి పట్టణంలో నివాసం ఉంటున్నారు. రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ చెందిన లతీఫ్ అనే వ్యక్తి భూమి చూపించడానికి ఏప్రిల్‌ 15న రామకృష్ణను హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. ఇంటి నుంచి వెళ్లిన రామకృష్ణ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆయన భార్య భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామకృష్ణను ట్రాప్ చేసి హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భార్గవి కుటుంబ సభ్యులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని ఆరోపిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories