హెచ్ఎంటీవీ మెగా బతుకమ్మ సంబురం.. అందరూ ఆహ్వానితులే...

hmtv to Organise Mega Bathukamma Samburam on Oct 1
x

హెచ్ఎంటీవీ మెగా బతుకమ్మ సంబురం.. అందరూ ఆహ్వానితులే...

Highlights

hmtv Mega Bathukamma Samburam: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిఏటా నిర్వహించే బతుకమ్మ పండుగ సంబరాలు మొదలయ్యాయి.

hmtv Mega Bathukamma Samburam: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిఏటా నిర్వహించే బతుకమ్మ పండుగ సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ‌ వార్తా ఛానెల్ హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో అక్టోబర్ ఒకటవ తేది శనివారం నాడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మెగా బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి.

అక్టోబర్ 1న సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ మెగా ఈవెంట్‌కి 10,000 మందికి పైగా హాజరవుతారని అంచనా. ఈ సందర్భంగా హెచ్ఎంటీవీ సీఈఓ N లక్ష్మీ రావు మాట్లాడుతూ... కోవిడ్ కి ముందు బతుకమ్మ పండుగ ఘనంగా జరిపాము అయితే గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారి కారణంగా బతుకమ్మ పండుగ జరపలేకపోయమని, కానీ ఈ సంవత్సరం సానుకూల వాతవారణం ఉన్నందున తెలంగాణ ప్రసిద్ధ పండుగను నిర్వహించాలకున్నామని తెలిపారు.

బతుకమ్మ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడా జరుపుకునే పూల పండుగ. ఇది ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు జరిపి దుర్గాష్టమి రోజున ముగుస్తుంది. ఔషధ విలువలు కలిగిన పూలతో బతుకమ్మని పేర్చుకొని కుటుంబ సమేతంగా జరుపుకునే ఏకైక పండగ అని సీఈఓ లక్ష్మీ రావు అన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories