విషాదం నుంచి విద్యాభ్యాసం వైపు కీర్తన! కృత్రిమ చేతులతో పాఠాలు నేర్చుకుంటోంది!!

విషాదం నుంచి విద్యాభ్యాసం వైపు కీర్తన! కృత్రిమ చేతులతో పాఠాలు నేర్చుకుంటోంది!!
x
Highlights

ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తు రెండు చేతుల్ని కోల్పోయిందో చిన్నారి. బడి ఆవరణలో విద్యుదాఘాతంతో మోచేతి దాకా రెండు చేతులను కోల్పోయింది. అస్సలు...

ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తు రెండు చేతుల్ని కోల్పోయిందో చిన్నారి. బడి ఆవరణలో విద్యుదాఘాతంతో మోచేతి దాకా రెండు చేతులను కోల్పోయింది. అస్సలు బతుకుతుందో లేదో అనుకున్న ఆ విద్యార్దిని ఇప్పుడు పుస్తకాలు పట్టుకొని చదువుతోంది. చేతులు కోల్పోయిన ఆ చిన్నారికి ఇక భవిష్యత్తు లేదు అనుకునే సమయంలో ఏమి జరిగింది ఇప్పుడు ఎలా ఉంది..? hmtv స్పెషల్ ఫోకస్ లో చూద్దాం.

రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకుంటున్న కీర్తన జీవితంలో ఓ విషాద ఘటన జరిగింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం గురుకుల బాలికల పాఠశాలలో చదువుతున్న కీర్తన 2019 ఫిబ్రవరి 16న ప్రమాదానికి గురైంది. బడి ఆవరణలో ఆటలాడుతుండగా ప్రమాదవశాత్తు ఆమె చేతులు 11 కేవీ విద్యుత్తు తీగలకు తాకాయి. తీవ్ర విద్యుదాఘాతంతో విలవిలలాడిన కీర్తన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. అయితే, హైదరాబాద్‌ డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో రెండు నెలల పాటు ఐసీయూలో చికిత్స తీసుకుంది.

ఆ సమయంలో కీర్తనకు కొట్టిన షాక్ మామూలుగా జరగలేదు. హై వోల్టేజీతో చేతుల నరాలు దెబ్బతిన్నాయి. దీనితో రెండు చేతులకు ఇన్‌ఫెక్షన్‌ సోకింది. ఆ చేతుల్ని అలాగే ఉంచితే ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు చెప్పారు. దీనితో కీర్తన రెండు చేతులను మోచేతి దాకా తొలగించారు. ఆస్పత్రి నుంచి ఇంటికి పంపిన తర్వాత ఆమె కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏసీ ఏర్పాటు చేసిన చిన్న రేకుల షెడ్డులో ఉంచి అవసరమైన వైద్య సేవలందించారు.

ఇక చేతులు కోల్పోయిన కీర్తన కు మళ్లీ ఆ చేతులు తెచ్చే అవకాశం లేదు. కాని చేతుల రూపంలో ఉండే కృత్రిమ చేతులు అమర్చాలని బావించారు. దీనితో 8 లక్షలు ఖర్చు చేసి కీర్తనకు జపాన్‌ నుంచి కృత్రిమ చేతులను తెప్పించి అమర్చారు. గురుకుల విద్యాసంస్థల రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ఈ నిధులను మంజూరు చేయించారు. కృత్రిమ చేతుల వినియోగంపై కీర్తనకు హైదరాబాద్‌లో 12 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. కీర్తన ప్రమాదానికి గురైనప్పటి నుంచి గురుకుల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మానవతా దృక్పథంతో వ్యవహరించారని, వైద్య ఖర్చులకు ప్రత్యేక చొరవ చూపారని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. ‎మొత్తం వైద్యానికి గురుకుల సంస్థ నుంచి 30 లక్షలు చెల్లించారు.

ఆ సమయంలో తీవ్ర విద్యుదాఘాతంతో మోచేతి దాక రెండు చేతులనూ కోల్పోయింది కీర్తన. ఇప్పుడదే చిన్నారి పుస్తకాన్ని పట్టుకుంటోంది. పెన్నుతో నోటు బుక్కులో రాస్తోంది. ఇతర చిన్న చిన్న పనులనూ చేసుకుంటోంది. దానికి ప్రదాన కారణం కృత్రిమ చేతులు అమర్చడమే ప్రత్యేకంగా జపాన్‌ నుంచి తెప్పించిన కృత్రిమ అవయవాలు సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురానికి చెందిన కీర్తన జీవితంలో ఇలా కొత్త వెలుగులు ప్రసరించాయి. కృత్రిమ చేతులతో రాయడంతో పాటు సొంత పనులు చేసుకుంటున్న కీర్తన నడిగూడెంలోని గురుకుల పాఠశాలకు తిరిగి వెళ్లింది. ఇక తమ తోటి సఖి మళ్లీ వస్తుందో రాదో అనుకున్న కీర్తన ఫ్రెండ్స్ ఆమెతో సరదాగా గడుపుతున్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories