Old Woman - Hyderabad: ఉప్పల్‌లో వృద్ధురాలి దీనగాథ

hmtv Special Story about Old Woman in Hyderabad Who is Homeless | GHMC | Hyderabad News Today
x

ఉప్పల్‌లో వృద్ధురాలి దీనగాథ

Highlights

*ఏడాది క్రితం శిథిలావస్థకు చేరిన ఇళ్లును కూల్చిసిన అధికారులు *కొత్త ఇళ్లు కట్టి ఇస్తామని హామీ

Old Woman - Hyderabad: వర్షాకాలం వచ్చింది.. మీ ఇళ్లు శిథిలావస్థకు చేరిందంటూ వచ్చి హడావుడిగా ఇళ్లును కూల్చేశారు. ఎంత మొరపెట్టుకున్నా అధికారులు వినలేదు. దీంతో ఆ వృద్ధురాలు, తన కుమారుడు, మనవరాలు ముగ్గురు రోడ్డున పడ్డారు.

కూల్చిన ఇళ్లు కట్టిస్తామని ఏడాది క్రితం హామీ ఇచ్చారు. అయినా ఇంతవరకు నెరవేరలేదు. ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా లాభం లేకుండా పోయింది. దీంతో చేసేదేమీలేక తాత్కాలిక షెడ్డులోనే ఆ వృద్ధురాలు జీవనం సాగిస్తోంది.

హైదరాబాద్‌ ఉప్పల్‌లో తన భర్త కట్టించిన ఇంట్లోనే వృద్ధురాలు నర్సమ్మ నివాసముంటుంది. చివరి రోజుల్లో తన ఆలనా పాలనా చూడాల్సిన కొడుకు మద్యానికి బానిసయ్యాడు. కొడలు మరణంతో మనవరాలి బాధ్యత తనపై పడింది. ఈ నేపథ్యంలో ఉన్న ఒక్క ఇంటిని శిథిలావస్థకు చేరిందని ఏడాది క్రితం జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చేశారు.

ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామిని అధికారులు ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. దీంతో స్థానికుల సహాయంతో తాత్కాలిక షెడ్డు వేసుకుని మనవరాలితో జీవనం సాగిస్తోంది. ఈ వయసులో పనిచేయడానికి ఓపిక కూడా లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులు త్వరగా ఇప్పించాలని వేడుకుంటుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories