ఆదిలాబాద్ జిల్లాలో డబల్ బెడ్ రూమ్ఇల్లు కలగానే మిగిలిపోయిందా?

ఆదిలాబాద్ జిల్లాలో డబల్ బెడ్ రూమ్ఇల్లు కలగానే మిగిలిపోయిందా?
x

డబల్ బెడ్ రూమ్ హౌస్ ఫైల్ ఫోటో 

Highlights

తెలంగాణ ప్రభుత్వం కొలువు దీరాక పేద ప్రజల కష్టాలు తొలగిపోతాయని సంబరపడ్డారు

తెలంగాణ ప్రభుత్వం కొలువు దీరాక పేద ప్రజల కష్టాలు తొలగిపోతాయని సంబరపడ్డారు. ముఖ్యమంత్రి పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు వరాల జల్లు కురిపించారు.గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తే అంతకంటే గొప్పగా పేదవారు ఉండడానికి డబల్ బెడ్ రూమ్ లను కట్టించి ఇస్తామని ఆర్భాటంగా ప్రారంభోత్సవాలు చేశారు.అంత బాగానే ఉన్నా నిర్మాణాలు స్లాబ్ దశలోనే ఆగిపోయాయి.బిల్లులు రాక కాంట్రాక్టర్ లు చేతులెత్తేశారు.పేదోడి ఆశ ఇంతలోనే అవిరైపోయింది. డబల్ బెడ్ రూమ్ఇల్లు కల కలగానే మిగిలిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డబల్ బెడ్ రూమ్ ఇళ్లనిర్మాణంపైhmtvఅందిస్తున్నప్రత్యేకకథనం.

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఏర్పడ్డ పేదోడి పరిస్థితి మాత్రం మారడం లేదు రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు గత ముప్పై ఏళ్లుగా శిథిలమౌతున్న గుడిసెల్లోనే కాలం వెల్లదీస్తున్నారు ఎప్పుడు కులుతాయో తెలియదు. వాన వస్తే నీరు దరాలై పారుతుంది. గట్టిగా గాలి వస్తే పై కప్పు ఉంటుందో ఉడిపోతుందో తెలియదు బిక్కు బిక్కు మంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడపాల్సిన పరిస్థితి. పేదోడిస్వాంత ఇంటి నిర్మాణం కళ కళగానే మిగులుతోంది అదిగో డబుల్ బెడ్రూం ఇల్లు ఇదిగో శెంకుస్థాపన అనడమే తప్ప ఆచరణలో అమలు కావడం లేదు వర్షాలకు తడిసి అవి ఎప్పుడు కూలుతాయోనని భయాందోళన మధ్య జీవనం గడుపుతున్నారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లోని గ్రామాల పేదల కన్నీటి గోడు ఇది. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందడం లేదు పేదలకు సొంతింటి కళను నెరవేర్చడానికి తెచ్చిన పథకం నిరుగారుతుంది అశగా ఎదురు చూసినపేదమద్యతరగతి వారికి నిరాశే మిగిలింది.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడకల ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయిఏళ్ళు గడుస్తున్నా పనుల్లోమాత్రం పురోగతి లేదు అర్హులైన ప్రతినిరుపేద కుటుంబానికి రెండు పడకల ఇళ్లను నిర్మించి ఇస్తానన్న ప్రభుత్వం పనులు నత్తనడకన సాగుతున్న పట్టించుకోవడం లేదు. మంచిర్యాలజిల్లా బెల్లంపల్లి నియోజకవర్గానికి నాలుగువందలఇళ్లను మంజూరు చేసిందితెలంగాణప్రభుత్వం.బెల్లంపల్లిపట్టణ పరిధిలో సుమారు 160ఇళ్లను నిర్మించడానికి చర్యలు తీసుకున్నారు. అందుకు అనుగుణంగా బెల్లంపల్లి పట్టణంలో గల కన్నలగ్రామ శివారులోని సర్వే నెం.127-130-లలో భూమిని సేకరించారు. సగానికిపైగా ఇళ్ళు స్లాబ్ దిశ దాటాయి. ఈ ఇళ్ల నిర్మాణ పనులు సైతం నాసిరకంగా జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు.

ఇసుక, రాడ్లు, సిమెంట్ కొరతతోనిర్మాణాలకు నాసిరకం వస్తువులు వాడటంతో ఎక్కువ కాలం ఈరెండు పడకల ఇళ్ళు నిలువయని స్థానికులుఅంటున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి.కసిపేట,కన్నెపల్లి బీమిని,నెన్నెల,వేమనపల్లి.మండలాల్లో రెండు పడకల ఇళ్ళు నిర్మించడానికి మండలానికి సుమారు 40.ఇళ్ళును కేటాయించారూ. మండలాల్లో ఇళ్లను నిర్మించడానికి కనీసం స్థలం కూడాసేకరించకపోవడం, స్థలం సేకరించి నిర్మాణాలు ప్రారంభించిన మండలాల్లోసమయానికి బిల్లులు రాలేదని గుత్తేదార్లు ఆందోళన చెందుతున్నారు నాయకులు అధికారుల నిర్లక్ష్యంతోనే పనులు ముందుకు సాగడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపుఈ అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయిసరైన భూసేకరణచేయకపోవడంతోపట్టణాలకు గ్రామాలకు దూరంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం, అవి నిర్మాణదశలోనేఆగిపోవడంతోమందుబాబులకు పేకాటరాయుళ్లకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇకనైనా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవ తీసుకొని పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.Show Full Article
Print Article
Next Story
More Stories