ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై హెచ్ఎంటీవీ ఫోకస్.. దశదిశ కార్యక్రమం నిర్వహిస్తున్న హెచ్ఎంటీవీ

hmtv Dasha-Disha: ఖమ్మం జిల్లా. ఉద్యమాల ఖిల్లా. రాజకీయ చైతన్యానికి కేంద్రం. అలాంటి ప్రాంతం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.

Arun Chilukuri
Published on: 9 Sept 2023 6:12 PM IST
hmtv Dasha Disha Programme in Khammam
X

ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై హెచ్ఎంటీవీ ఫోకస్.. దశదిశ కార్యక్రమం నిర్వహిస్తున్న హెచ్ఎంటీవీ

hmtv Dasha-Disha: ఖమ్మం జిల్లా. ఉద్యమాల ఖిల్లా. రాజకీయ చైతన్యానికి కేంద్రం. అలాంటి ప్రాంతం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. కనీస సౌకర్యాలు లేక జనం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధిలేక నిరుద్యోగులు వలస పోతున్నారు. వర్షం వచ్చిందంటే అనేక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. అనేక చోట్ల తాగు సాగునీటి సమస్య వెంటాడుతోంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. ఎప్పటి నుంచి అనుకుంటున్న గిరిజన మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు ఒక కలగానే మిగిలిపోయింది. అలాంటి పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో పాలకులకు తెలియ చెప్పేందుకు మరో సామాజిక బాధ్యతను భుజానికెత్తుకుంది హెచ్ఎంటీవీ. ఉమ్మడి జిల్లాలో సమస్యలపై దశదిశ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story