అక్రమ కట్టడాలపై HMDA ఉక్కుపాదం

HMDA: రూ.45 కోట్ల విలువ చేసే మూడు ఎకరాల కబ్జాకు యత్నం

Dhatripriya
Published on: 6 May 2023 7:01 PM IST
HMDA Clamp Down On Illegal Constructions
X

అక్రమ కట్టడాలపై HMDA ఉక్కుపాదం

Hyderabad: గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడాలపై HMDA ఉక్కుపాదం మోపింది. పెద్ద అంబర్‌పేట దగ్గర అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు అధికారులు. విజయవాడ హైవే సమీపంలో 45 కోట్ల రూపాయల విలువ చేసే మూడు ఎకరాల కబ్జాకు యత్నించారు. ఈ విష‍యం అధికారుల దృష్టికి రావడంతో ఇవాళ నిర్మాణాలను తొలగించారు. HMDAకి చెందిన భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన ఐదుగురిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. HMDA భూముల జోలికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story