Top
logo

హైదరాబాద్‌ ఉప్పల్‌‌ గంజాయి స్మగ్లింగ్ కేసులో కొత్త కోణం

హైదరాబాద్‌ ఉప్పల్‌‌ గంజాయి స్మగ్లింగ్ కేసులో కొత్త కోణం
X
Highlights

హైదరాబాద్‌ ఉప్పల్‌‌లో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ కానిస్టేబుల్ కేసులో అనంతపురం జిల్లా హిందూపురం...

హైదరాబాద్‌ ఉప్పల్‌‌లో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ కానిస్టేబుల్ కేసులో అనంతపురం జిల్లా హిందూపురం టూటౌన్‌ లా అండ్‌ ఆర్డర్‌ సీఐ శ్రీరామ్‌ పేరు వినబడుతోంది. నల్లచెరువు ప్రాంతంలో రెండు కిలోల గంజాయితో అనంతపురం జిల్లా ఏఆర్‌ కానిస్టేబుల్‌ మోహన్‌కృష్ణ పట్టుబడ్డాడు. ఏపీ పోలీస్‌ స్టిక్కర్‌ ఉన్న కారులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించిన ఆబ్కారీ పోలీసులు. ఏఆర్‌ కానిస్టేబుల్‌ మోహన్‌తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో సీఐ, కానిస్టేబుల్‌ కలిసి గంజాయి స్మగ్లింగ్‌ చేసినట్టు ఆరోపణలు ఉండటంతో సీఐ శ్రీరామ్‌ పాత్రపై విచారణ చేపడుతున్నారు. గంజాయి స్మగ్లింగ్‌లో ఆరోపణలు రావడంతో హిందూపురం టూటౌన్‌ సీఐ శ్రీరామ్‌పై బదిలీ వేటు వేశారు అనంతపురం రేంజ్ డీఐజీ.


Web Titlehindupur two town ci name in the illegal ganja transport case
Next Story