హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

Arun Chilukuri
Updated on: 14 Dec 2020 5:22 PM IST
హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం
X

హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. చౌటుప్పల్‌ మండలంలోని కైతాపురం దగ్గర దత్తాత్రేయ వాహనం ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులోనే దత్తాత్రేయ ఉండగా ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. దత్తాత్రేయ సహాయకుడికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌ నుంచి నల్గొండకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. దీంతో మరో వాహనంలో నల్గొండ పర్యటనకు బయల్దేరారు దత్తాత్రేయ. విషయం తెలుసుకున్న చౌటుప్పల్‌ ఏసీపీ సత్తయ్య, ఇన్‌స్పెక్టర్‌ వెంకన్నలు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story