logo
తెలంగాణ

Hyderabad: సౌత్ జోన్ పరిధిలో పెరుగుతున్న క్రైమ్

Hiking the Crime In Hyderabad South Zone
X

Representational Image

Highlights

Hyderabad: జైలుకెళ్లి వచ్చాకా పెరుగుతున్న క్రైమ్ రేట్ * రౌడీ షీటర్లను కట్టడి చేసేందుకు సౌత్ జోన్ పోలీసుల ప్రణాళిక

Hyderabad: హైద‌రాబాద్ లోని ఓల్డ్ సిటీ రౌడీ షీట‌ర్ల‌కు అడ్డాగా మారిందా? పాత‌బ‌స్తీ కేంద్రంగానే ఇల్లీగ‌ల్ యాక్టివిటీస్ కు స్కెచ్ లు వేస్తున్నారా? కొంత‌కాలంగా ప్రశాంతంగా ఉన్న న‌గ‌రంలో మ‌ళ్లీ రౌడీ షీట‌ర్ల ఆగ‌డాలు ఎందుకు పెరిగాయి? వ‌రుస హత్య‌లు ఎందుకు జ‌రుగుతున్నాయి.? అస‌లు క్రిటిక‌ల్ జోన్ గా భావించే సౌత్ జోన్ ప‌రిధిలో పోలీసుల చ‌ర్య‌లు ఎంటీ.?

ఇటీవ‌ల కాలంలో న‌గ‌రంలోని మూడు క‌మీష్ న‌రేట్ ల ప‌రిధిలో రౌడీ షీట‌ర్ల ఆగ‌డాలు పెరిగాయి. ఫ‌లితంగా హ‌త్య‌లు, ఇత‌ర ఇల్లీగ‌ల్ యాక్టివిటీస్ కూడా పెరిగాయి. ప్ర‌ధానంగా సౌత్ జోన్ ప‌రిధిలోని ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉన్న రౌడీ షీట‌ర్లు జైల్ కు వెళ్లి బ‌య‌ట‌కు వ‌చ్చాకా ఎక్కువ‌గా క్రైమ్స్ కు పాల్ప‌డుతున్న‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం ఉంది.

ఇక ఓల్డ్ సిటీలో రౌడీ షీట‌ర్ల ఆగ‌డాలు ఎక్కువౌతున్న నేప‌ధ్యంలో వారిని క‌ట్ట‌డి చేసేందుకు సౌత్ జోన్ పోలీసులు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. స‌డెన్ గా రాత్రి వేళ‌ల్లో పోలీసు రికార్డుల్లో ఉన్న రౌడీ షీట‌ర్ల ఇంటికి వెళ్లి కుటుంబ‌స‌భ్యుల స‌మ‌క్షంలో రౌడీ షీట‌ర్ల‌కు స‌త్ ప్ర‌వ‌ర్త‌న పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. హ‌త్య‌లు, ఇత‌ర క్రైమ్స్ కు పాల్ప‌డితే పర్యవసానాలు ఎలా ఉంటాయో పోలీసుల చ‌ర్య‌లు ఏ విధంగా ఉంటుందో వివరిస్తున్నారు.

రౌడీల క‌ద‌లిక‌లపై నిరంత‌ర నిఘా ఉంటుంద‌ని ఎలాంటి క్రైమ్స్ కు పాల్ప‌డిన‌ పాల్ప‌డే వారికి స‌హ‌క‌రించిన స‌హించేది లేద‌ని, నిరంత‌ర ప్ర‌క్రియ‌గా రౌడీ షీట‌ర్ల కౌన్సిలింగ్ కొన‌సాగుతుంద‌ని సౌత్ జోన్ డీసీపీ అన్నారు. ఏదేమైనా న‌గ‌రంలోనే అత్యంత స‌మ‌స్యాత్మ‌కంగా భావించే సౌత్ జోన్ ప‌రిధిలో రౌడీ షీట‌ర్ల ఆగ‌డాల‌కు చెక్ పెట్టేందుకు పోలీసులు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.

Web TitleHyderabad: Hiking the Crime In Hyderabad South Zone
Next Story