హైదరాబాద్‌లో హిజ్రాలు వీరంగం

హైదరాబాద్‌లో హిజ్రాలు వీరంగం
x
Highlights

* పది మంది అరెస్ట్.. రూ.16,500 స్వాధీనం

హైదరాబాద్‌లో గత కొంతకాలంగా హిజ్రాల అరాచకాలు పెరిగిపోతున్నాయి. షాప్‌ ఓపెనింగ్స్‌, పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, బర్త్‌ డే పార్టీలుఇలా.. ఫంక్షన్‌ ఏదైనా సరే ఇంటి ముందు సందడి లేదా టెంట్‌, పందిరి కనిపిస్తే చాలు.. పిలవని పేరంటానికి వచ్చి హడావిడి చేస్తుంటారు. సంబంధిత వ్యక్తులను పట్టుకుని ఇబ్బందులకు గురిచేస్తారు. డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇవ్వకుంటే బెదిరింపులకు పాల్పడుతారు. ఆడవాళ్లు, చిన్నపిల్లలు ఉన్నారన్న విషయం కూడా మరిచి.. సిగ్గుతో తల దించుకునేలా చేస్తారు. చప్పట్లు కొట్టడం, పెద్దగా అరవడం వంటివి చేస్తూ విసుగు పుట్టిస్తుంటారు.

బాచుపల్లి పీఎస్ పరిధిలో హిజ్రాలు హల్‌చల్ చేశారు. ప్రగతి నగర్‌లో వ్రతం జరుగుతున్న ఇంట్లోకి 10 మంది హిజ్రాలు చొరబడి ఇంటి యజమాని నుంచి 20 వేలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో అక్కడే అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చివరకు ఇంటి యజమాని నుంచి 16వేల ఐదు వందల బలవంతంగా వసూలు చేసి వెళ్లిపోయారు. ఇంటి యజమాని హిజ్రాలపై బాచుపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు 10 మంది ట్రాన్స్ జెండర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 సెల్‌ఫోన్లు, 16వేల 500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనే నిజాంపేట్‌ మున్సిపాలిటీ ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది. ఈ నెల 24న ఓ వ్యక్తి తన కుమారుడి వివాహం జరిపించాడు. 25న సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తుండగా.. విషయం తెలుసుకున్న హిజ్రాలు రెండు ఆటోల్లో వచ్చి.. ఇబ్బందులకు గురిచేశారు. 20వేలు ఇవ్వాలని లేనిపక్షంలో కార్యక్రమాన్ని అడ్డుకుంటామని బెదిరించారు. తన దగ్గర అంత ఎక్కువ మొత్తంలో డబ్బు లేదని ఆ వ్యక్తి చెప్పగా.. ససేమిరా అంటూ పూజను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో విసిగి వేసారిపోయిన అతడు.. 16వేల 500 రూపాయలు ఇచ్చి వారిని అక్కడి నుంచి పంపించేశాడు.

అయితే.. బంధువులు, ఇంటిచుట్టుపక్కలవారు అందరూ చూస్తుండగా ఈ ఘటన జరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితుడు.. వెంటనే బాచుపల్లి పోలీసులకు సమాచారమిచ్చాడు. జరిగిన విషయాన్ని వివరించాడు. దీంతో ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 8 మంది హిజ్రాలతో పాటు ఇద్దరు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఘటనపై సీఐ స్పందించారు. ఫంక్షన్ల షెడ్యూల్‌ తేదీల గురించి ముందే ట్రాన్స్‌జెండర్స్‌ సమాచారం సేకరిస్తారని, నిర్వాహకుల నుంచి భారీగా డబ్బులు డిమాండ్‌ చేసి బెదిరిస్తూ పరువు తీస్తారని సీఐ తెలిపారు.

ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే డయల్ 100 లేదా వాట్సాప్‌ నంబర్‌ 9490617444కు కాల్‌ చేయాలని సీఐ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories