మునుగోడులో హై వోల్టేజ్ రాజకీయాలు

Munugode Politics: ఈ నెల 20న కేసీఆర్ సభకు ఏర్పాట్లు

Sriveni Erugu
Published on: 13 Aug 2022 9:15 AM IST
High Voltage Politics in Munugode
X

మునుగోడులో హై వోల్టేజ్ రాజకీయాలు

Munugode Politics: రోజురోజుకు మునుగోడు పాలిటిక్స్‌ కాకరేపుతున్నాయి. ఉపఎన్నిక షెడ్యూల్‌ విడుదల కాకపోయిన ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మాటలతో కత్తులు దూసుకుంటున్నాయి. ఈ నెల 20న కేసీఆర్ సభకు రంగం సిద్ధం కాగా ఈ నెల 21న అమిత్ షా పర్యటించనున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ సభకు ధీటుగా బహిరంగ సభ నిర్వహించాలని కమలనాథులు దృష్టిసారించారు. అయితే సిట్టింగ్ స్ధానాన్ని వదులుకోకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే నేడు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. ఇప్పటికే పీసీసీ ఛీప్‌పై ఆగ్రహంగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. పిలవని పేరంటానికి వెళ్లబోనని తేల్చిచెప్పారు. ఇక నియోజకవర్గంలో తామే కీలకమంటున్నారు లెఫ్ట్‌ పార్టీ నేతలు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story