Temperature: తెలంగాణలో మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు

Temperature: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

Jyothi
Published on: 18 Jun 2023 2:42 PM IST
High Temperatures in Telugu States
X

Temperature: తెలంగాణలో మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు

Temperature: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు. తెలంగాణలో మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి.. మరోవైపు ఏపీలో మరో రెండు రోజులపాటు వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ 315 మండలాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించారు. 109 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.

అల్లూరి 9, అనకాపల్లి 6, బాపట్ల 8, తూర్పుగోదావరి 17, ఏలూరు12, గుంటూరు 9, కాకినాడ 18, కోనసీమ 7, కృష్ణా 15, మన్యం 5, పశ్చిమగోదావరిలో 3 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఉష్ణోగ్రతలు 42 - 44 డిగ్రీల మధ్య నమోదు కావొచ్చని.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Jyothi

Jyothi

Next Story