Temperature: తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు

Temperature: పలు జిల్లాల్లో 41డిగ్రీలపైనే గరిష్ఠ ఉష్ణోగ్రత * హైదరాబాద్‌లోనూ 39 డిగ్రీలు నమోదు

Sandeep Eggoju
Published on: 28 March 2021 12:19 PM IST
High Temperature in Telangana
X
టెంపరేచర్ (ఫైల్ ఫోటో)

Temperature: తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 10 గంటల సమయంలోనే ఎండలు మంటపుట్టిస్తున్నాయి. ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు పలుచోట్ల 41 డిగ్రీలు దాటాయి. అత్యధికంగా జగిత్యాల, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నమోదయ్యాయి.

జగిత్యాల జిల్లా కోరుట్లలో 41.3 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. జీహెచ్‌ఎంసీలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డవగా.. అత్యధికంగా నారాయణగూడలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఈ స్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story