Weather Report: తెలంగాణలో మాడు పగిలేలా ఎండలు

Weather Report: ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు వడగాలులు

Shashank Gullapelli
Published on: 29 April 2024 10:40 AM IST
High Temperature In Telangana
X

Weather Report: తెలంగాణలో మాడు పగిలేలా ఎండలు

Weather Report: తెలంగాణలో సూరీడు భగభగా మండిపోతున్నాడు. ఓ వైపు ఉక్కపోత.. మరో వైపు తీవ్ర వేడిగాలులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. మరో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు వీచే అవకాశముందని.. సోమ, మంగళవారాల్లో 41 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఇవాళ వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story