భానుడి భగభగలు.. బయటకు రావాలంటేనే జంకుతున్న ప్రజలు

High Temperature in Telangana
x

భానుడి భగభగలు.. బయటకు రావాలంటేనే జంకుతున్న ప్రజలు

Highlights

Telangana: పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

Telangana: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. రాబోయే రెండు రోజుల పాటు తీవ్రమైన ఎండలతో పాటు వడగాడ్పుల ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందుముందు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో రేపు, ఎల్లుండి వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలు కూడా రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలో ఎక్కువగా 43 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయని... ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 13 జిల్లాలకు ఆరెంజ్​అలర్ట్ జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories