New Rules at High Risk Zones in Hyderabad: హైదరాబాద్ హై రిస్క్ జోన్లలో కొత్త రూల్స్.. అవి ఏంటంటే..

New Rules at High Risk Zones in Hyderabad:  హైదరాబాద్ హై రిస్క్ జోన్లలో కొత్త రూల్స్.. అవి ఏంటంటే..
x
Coronavirus Updates in Telangana:
Highlights

New Rules at High Risk Zones in Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి.

New Rules at High Risk Zones in Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. ముఖ్యంగా హైదరబాద్ నగరంలో కేసుకు అధిక సంఖ్యలో పెరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ కేసుల తీవ్రత ఎక్కువగా నేపథ్యంలో ప్రభుత్వం కట్టడి చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే నగరంలోనే 500 కిపైగా కోవిడ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాలను తెలంగాణ సర్కారు హై రిస్క్ జోన్లుగా ప్రకటించింది. అంతే కాకుండా ఈ ఏరియాలకు నోడల్ ఆఫీసర్లను కూడా నియమించింది.

అంబర్ పేట, చాంద్రాయణ గుట్ట, యూసుఫ్ గూడ, చార్మినార్, రాజేంద్ర నగర్, కార్వాన్, మెహిదీ పట్నం, కుత్బుల్లాపూర్ ప్రాంతాలు హై రిస్క్ జోన్లుగా ఉండగా ఈ ప్రాంతాల్లో కరోనా కట్టడి బాధ్యతను నోడల్ ఆఫీసర్లు తీసుకోనున్నారు. అంతే కాక ఏ ప్రాంతంలోనైనా కరోనా వైరస్ కేసులు ఎక్కువా నమోదైతే.. దాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించనున్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి వైద్య సేవలు సరిగా అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేసుల తీవ్రతను బట్టి షాపులు, ఇతర వ్యాపార కార్యకలాపాలను నిర్దిష్ట సమయం వరకే తెరవడానికి అనుమతిస్తున్నారు. ఆ ప్రాంతంలో రాకపోకలకు వీలు లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఇక పోతే తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. సోమవారంఅత్యధికంగా 1550 కేసులు నమోదు. నిన్న కుడా అధికంగా 1,524కేసులు నమోదయ్యాయి. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 815, మేడ్చల్‌లో 97, సంగారెడ్డిలో 61, రంగారెడ్డిలో 240, ఖమ్మం 08, కామారెడ్డి 19, వరంగల్ అర్బన్ 30, వరంగల్ రూరల్ 02, నిర్మల్ 03, కరీంనగర్ 29, నిజామాబాద్ 17, జగిత్యాల 02 , మెదక్ 24, మహబూబ్ నగర్ 07, మంచిర్యాల 12, కొత్తగుడెం 08, జయశంకర్ భుపలపలి 12, నల్గొండ 38, సిరసిల్ల 19, ఆసిఫాబాద్ 05, ఆదిలాబాద్ 07, వికారాబాద్ 21, నగర్ కర్నూల్ 01, జనగాం 04, ములుగు 06, వనపర్తి 05, సిద్దిపేట 04, సూర్యాపేట 15, గద్వాల్ 13, కేసులు నమోదయ్యాయి.

నిన్న 10 మంది కరోనాతో మృతి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 375 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 37,745కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అటు కరోనాతో పోరాడి ఇప్పటివరకు 24,840 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవ్వాల ఒక్క రోజే 1,161 మంది డిశ్చార్జ్ అయ్యారు.



Show Full Article
Print Article
Next Story
More Stories