Telangana: వారికి ప్రాణదాత నిజామాబాద్ దవాఖాన..ఇప్పటికే 70మందికి..

High-risk COVID Patients Deliverd at Nizamabad Hospital
x

Telangana: కరోనా సోకిన గర్బిణీల పాలిట ప్రాణదాత నిజామాబాద్ ఆస్పత్రి

Highlights

Telangana: ఆ సర్కారు వైద్యులు సవాళ్ళు స్వీకరించారు. కరోనా సోకిన గర్బిణీలకు అక్కున చేర్చుకుని డెలివరీలు చేశారు.

Telangana: ఆ సర్కారు వైద్యులు సవాళ్ళు స్వీకరించారు. కరోనా సోకిన గర్బిణీలకు అక్కున చేర్చుకుని డెలివరీలు చేశారు. తల్లి నుంచి బిడ్డకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతేడాది లాక్ డౌన్ నుంచి ఇప్పటివరకు 70 మంది గర్భిణీలకు డెలివరీలు చేశారు. కరోనా కష్టకాలంలో అమ్మలకు అండగా నిలుస్తున్న నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిపై స్పెషల్ స్టోరీ.

నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు కరోనా సోకిన గర్బిణీల పాలిట ప్రాణదాతలుగా మారారు. గతేడాది లాక్ డౌన్ నుంచి ఇప్పటివరకు 70 మంది గర్భిణీలకు డెలివరీ చేశారు. గతేడాది లాక్ డౌన్ సమయంలో నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు మూసేశారు. అలాంటి పరిస్ధితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వచ్చిన గర్బిణీలకు నిజామాబాద్ ఆసుపత్రి వైద్య సిబ్బంది అక్కున చేర్చుకుని వైద్యం అందించారు.

కరోనా రోగికి చికిత్స చేసేందుకు డాక్టర్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కరోనా సోకిన గర్బిణీల ప్రసవం విషయంలో నిజామాబాద్ ఆసుపత్రి వైద్య సిబ్బంది సాహసం చేశారు. తల్లి నుంచి బిడ్డకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు.

కరోనా సోకిన గర్బిణీలకు డెలివరీ చేసేందుకు నిజామాబాద్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డుతో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశారు. మొదట్లో వైద్యం చేసేందుకు కొంత భయపడ్డ డాక్టర్లు తర్వాత ధైర్యంతో ఒక్కో కేసుతో ప్రారంభించి ఇప్పటివరకు 70 మందికి డెలివరీ చేశారు. ముగ్గురికి ట్వీన్స్ జన్మించగా, ఒకరికి ముగ్గురు బిడ్డలు పుట్టారు. ఇంతవరకు ఒక్క బేబికి కూడా కరోనా సోకలేదు. వైద్య సిబ్బంది టీమ్ వర్క్ తో ఇది సాధ్యమైందంటున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్.

కరోనా సోకిన గర్బిణీలకు సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి తర్వాత నిజామాబాద్ ఆసుపత్రిలోనే అత్యధిక ప్రసవాలు జరిగాయి. కష్టకాలంలో మెరుగైన వైద్యం అందిస్తున్న నిజామాబాద్ ఆసుపత్రి వైద్యసిబ్బందిపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories