Telangana: సర్కార్ ఖజానాకు ఎక్సైజ్ కిక్.. కాసుల వర్షం కురిపిస్తున్న లిక్కర్ బిజినెస్

High Liquor Sales In Telangana From Last 6 Months
x

Telangana: సర్కార్ ఖజానాకు ఎక్సైజ్ కిక్.. కాసుల వర్షం కురిపిస్తున్న లిక్కర్ బిజినెస్

Highlights

Telangana: బర్త్ డే పార్టీ కావచ్చు.. ఫ్రెండ్స్ సరదాగా కలుసుకోవచ్చు. అకేషన్ ఏదైనా మందు బాటిల్ విప్పాల్సిందే పెగ్గు పడాల్సిందే.

Telangana: బర్త్ డే పార్టీ కావచ్చు.. ఫ్రెండ్స్ సరదాగా కలుసుకోవచ్చు. అకేషన్ ఏదైనా మందు బాటిల్ విప్పాల్సిందే పెగ్గు పడాల్సిందే. తెలంగాణలో చాలా సందర్భాల్లో మద్యం ఏరులై పారుతుంది. అందుకే రాష్ట్రంలో ఎక్సైజ్ బిజినెస్ సర్కారు ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఏటికేడు లిక్కర్ వ్యాపారం కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే ఆల్ టైమ్ హై సేల్స్ నమోదవడం ఎక్సైజ్ అధికారులనే ఆశ్చార్యానికి గురిచేస్తోంది. సీజన్, సిచువేషన్ అనే తేడా లేకుండా మద్యం అమ్మకాల జోరు మాత్రం కొనసాగుతూనే ఉంది.

రెండేళ్ల కరోనా కాలంలో సేల్స్ కొంత తగ్గినా రాబడి మాత్రం ఈ ఏడాది గాడినపడింది. గతంలో కంటే ఈ సమ్మర్ లో మద్యం బిజినెస్ విపరీతంగా పెరిగింది. మందుబాబులు బాటిళ్లకు బాటిళ్లు ఖాళీ చేస్తున్నారు. వేల కోట్ల ఆదాయం సమకూరింది. అలా తెలంగాణ ఖజానాకు ఫుల్ కిక్ వచ్చేంది. గడచిన ఆరు నెలల్లోనే ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు ఏకంగా 15 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరిందంటే మందుబాబుల ఉత్సాహం ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ 15 వరకు ఎక్సైజ్‌శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం కేవలం ఐదున్నర నెలల కాలంలోనే తెలంగాణ వ్యాప్తంగా మద్యం అమ్మకాలపై 15 వేల 235 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో రంగారెడ్డి జిల్లా నుంచే అత్యధికంగా 3 వేల 354 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు కోటి 65 లక్షల 10 వేల 978 ఫుల్‌ బాటిల్స్‌ తాగగా 2 కోట్ల 33 లక్షల 69 వేల 322 బీర్లు అమ్ముడయ్యాయి. మద్యం ధరలు పెరగకముందు నెల రోజుల్లో అంటే ఏప్రిల్ 19 నుంచి మే 18 వరకు రాష్ట్రంలో 2 వేల 800 కోట్లకు పైగా మద్యం అమ్ముడుపోగా 28 లక్షల 37 వేల 109 కేసుల లిక్కర్, బీర్లు విక్రయించారు. ధరలు పెరిగిన అనంతరం నెల రోజుల్లో అంటే మే 19 నుంచి జూన్ 18 వరకు 3 వేల 330 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. అందులో 30 లక్షల 52 వేల 184 కేసుల లిక్కర్, 57 లక్షల 36 వేల 884 కేసులు బీరు బాటిళ్లు అమ్ముడుపోయాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నెల రోజుల్లో 12 వందలా 70 కోట్లు మేర అధిక విక్రయాలు జరిగాయి.

రాష్ట్రంలో మద్యం అమ్మకాల విషయంలో సంవత్సరం మొత్తం ఒకలా ఉంటే గత నెల మాత్రం విపరీతంగా మద్యం సేల్ జరిగింది. కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా గత నెల 19న ధరల్ని పెంచారు. సేల్స్ తగ్గుతాయి అనుకున్నా అంచనాలను మించి అమ్మకాలు జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories