Dilsukhnagar Bomb Blast Case: దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పు నేడే

Dilsukhnagar Bomb Blast Case: దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో  హైకోర్టు తీర్పు నేడే
x

Dilsukhnagar Bomb Blast Case: దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పు నేడే

Highlights

Dilsukhnagar Bomb Blast Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013 ఫిబ్రవరి 21న...

Dilsukhnagar Bomb Blast Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013 ఫిబ్రవరి 21న బస్టాపులో, మిర్చిపాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మరణించారు. 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. మిగిలిన ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ఉరిశిక్ష పడిన నిందితుల్లో అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహమ్మద్, మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, యాసిన్ భత్కల్ అలియాస్ షారూఖ్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండె అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్ ఉన్నారు.

అనంతరం ఉరిశిక్ష ధ్రువీకరణ నిమిత్తం ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టుకు నివేదించింది. దీంతోపాటు ఐదుగురు నిందితులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ పి. శ్రీసుధలతో కూడిన ధర్మాసనం సుమారు 45రోజులపాటు సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును వాయిదా వేసింది. నిందితుల అప్పీళ్లు కింది కోర్టు తీర్పు ధ్రువీకరణపై ధర్మాసనం నేడు తీర్పును వెలువరించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories