Telangana: కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ

Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితుల పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

Arun Chilukuri
Published on: 17 May 2021 9:40 AM IST
High Court To Hear Corona Situation In Telangana
X

Telangana: కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ

Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితుల పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు, రాష్ట్రంలో ఉన్న కేసులు వివరాల పై ఆరా తీయనున్న హైకోర్టు, రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత, రేమిడిసివర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ పై వైద్య శాఖ, పోలీస్ శాఖ కోర్టుకు నివేదికను అందించనుంది. ఈనెల 14న రంజాన్ పండుగ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రిలాక్సేషన్ సమయంలో వీడియో గ్రఫీని సైతం పోలీసులు సమర్పించనున్నారు. మూడు కమిషనరేట్స్ పరిధిలోని వీడియో గ్రఫీని కోర్టుకు పోలీసులు సమర్పించనున్నారు. నేడు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story