TS High Court: రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే

TS High Court: విద్యాశాఖ కార్యదర్శి, డీఎస్ఈ, రంగారెడ్డి డీఈవోకు హైకోర్టు నోటీసులు

Shekhar G
Published on: 16 Sept 2023 3:52 PM IST
High Court Stay On Teachers Promotions In Telangana
X

TS High Court: రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే

TS High Court: రంగారెడ్డి జిల్లాలో టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల పదోన్నతులపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. రంగారెడ్డి జిల్లాలో సీనియారిటీ జాబితాపై పలువురు టీచర్లు పిటిషన్లు దాఖలు చేశారు. జీవో 317 ద్వారా ఇతర జిల్లాల టీచర్లను.. రంగారెడ్డి జిల్లాకు కేటాయించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. జిల్లా క్యాడర్ కన్నా ఎక్కువ టీచర్లను కేటాయించారన్నారు. ప్రాథమిక సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలకు తగిన సమయం ఇవ్వకుండా పదోన్నతులకు సిద్ధమయ్యారని పిటిషనర్లు అభ‌్యంతరం వ్యక్తం చేశారు.

వాదనల సందర్భంగా.. తుది సీనియారిటీ జాబితా ఇవ్వకుండా పదోన్నతులు ఇవ్వబోమన్నారు ప్రభుత్వ న్యాయవాది. ఈనెల 19వరకు సమయం కోరారు. కౌంటర్ దాఖలుకు...విద్యాశాఖ కార్యదర్శి, డీఎస్ఈ, రంగారెడ్డి డీఈవోకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీచర్ల పదోన్నతులపై స్టే విధిస్తూ.. విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది హైకోర్టు.

Shekhar G

Shekhar G

Next Story