తెలంగాణ ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చిన హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చిన హైకోర్టు
x
Highlights

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. ధరణి పోర్టల్‌లో వివరాల నమోదు అంశంపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పోర్టల్‌లో వ్యవసాయ ఆస్తుల నమోదుకు ఒత్తిడి చేయ వద్దని ఆదేశించింది.

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. ధరణి పోర్టల్‌లో వివరాల నమోదు అంశంపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పోర్టల్‌లో వ్యవసాయ ఆస్తుల నమోదుకు ఒత్తిడి చేయ వద్దని ఆదేశించింది. ఇప్పటి వరకు సేకరించిన వివరాలను కూడా బయటి వ్యక్తులకు ఇవ్వవద్దని సూచించింది. ఇక ఏ చట్టం ప్రకారం ఆధార్‌, కులం వివరాలు సేకరిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. కొత్త రెవెన్యూ చట్టం వ్యవసాయ భూములకు సంబంధించింది మాత్రమేనని, కొత్త రెవెన్యూ చట్టంలో వ్యవసాయేతర భూముల ప్రస్తావన ఎక్కడుందని నిలదీసింది.

అలానే వ్యక్తిగత వివరాలకు భద్రత ఎలా కల్పిస్తారని ప్రశ్నించిన హైకోర్టు... డేటా భద్రతకు సంబంధించి కొత్త రెవెన్యూ చట్టంలో ప్రస్తావనే లేదని తెలిపింది. అయితే డేటా భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఏజీ కౌంటర్ దాఖలుకు రెండు వారాలు గడువు కోరగా తదుపరి విచారణని ఈ నెల 20కి వాయిదా వేసింది. అలానే చట్టబద్ధత, డేటా భద్రతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories