కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

Arun Chilukuri
Published on: 26 Nov 2020 4:05 PM IST
కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం
X

కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజుకు 50 వేల పరీక్షలు చేయాలన్న నిబంధనలు పాటించడం లేదని కోర్టు తెలిపింది. అవసరం ఉన్నప్పుడు రోజుకు 50వేల పరీక్షలు చేస్తామని నివేదికలో పేర్కొనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావుపై కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హైకోర్టు వెల్లడించింది. యశోద, కిమ్స్, కేర్,సన్ షైన్ వంటి ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదులు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ ఫలితాలు ఏమో కానీ.. ఎన్నికలయ్యాక కరోనా రెండో దశ ఫలితాలు మాత్రం వస్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. రెండో దేశ కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదని హైకోర్టు సీరియస్ అయ్యింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story