High Court on Degree Exams in Telangana: డిగ్రీ,పీజీ పరీక్షలు రద్దు చేయడం కుదరదు..

High Court on Degree Exams in Telangana: డిగ్రీ,పీజీ పరీక్షలు రద్దు చేయడం కుదరదు..
x
Telangana High Court (File Photo)
Highlights

High Court on Degree Exams in telangana: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మోగుతుండడంతో పదో తరగతి విద్యార్ధులకు నిర్వహించాల్సిన పరీక్షలను రద్దు..

High Court on Degree Exams in telangana: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మోగుతుండడంతో పదో తరగతి విద్యార్ధులకు నిర్వహించాల్సిన పరీక్షలను రద్దు చేయడంతో పాటు ప్రవేశ పరీక్షలను కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే అదే విధంగా డిగ్రీ, పీజీ విద్యార్ధులకు కూడా పరీక్షలు రద్దు చేసి వారిని పై తరగతులకు ప్రమోట్ చేయాలని హై కోర్టులో పిల్ దాఖలు చేసారు. కాగా ఈ పిల్‌పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ విచారణలో పిటిషనర్‌ తరపు వాదించిన న్యాయవాది దామోదర్‌రెడ్డి పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్ మార్కుల ద్వారా గ్రేడింగ్ ఇవ్వాలని కోర్టుకు వినిపించారు.

ఇప్పటకే 8 రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారని, యూజీసీ మార్గదర్శకాలు కేవలం సూచనలు మాత్రమేనని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వం తరపున వాదించిన ఏజీ డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు చేయడం కుదరదని, యూజీసీ మార్గదర్శకాల ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. రెండు, మూడు వారాల తరువాత పరీక్షలను సంబంధించిన షెడ్యూల్ ను ఖరారు చేస్తామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అదే విధంగా మామిడి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో నిమ్జ్‌ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా పరిస్థితుల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశించింది. జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలిపై రేపు జరగాల్సిన బహిరంగ విచారణ వాయిదా వేయాలని ధర్మాసనం తెలిపింది.


Show Full Article
Print Article
Next Story
More Stories