Addanki Dayakar: ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు గైడ్‌లైన్స్ ఇచ్చింది

Addanki Dayakar: హైకోర్టు గైడ్‌లైన్స్‌ను కాంగ్రెస్ స్వాగతిస్తుంది-

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Sept 2024 2:45 PM IST
Addanki Dayakar
X

Addanki Dayakar

Addanki Dayakar: బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు గైడ్‌లైన్స్ ఇచ్చిందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌. హైకోర్టు గైడ్‌లైన్స్‌ను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. హైకోర్టు పరిధిలోనే స్పీకర్ నిర్ణయాలు, కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయన్నారు. కేసీఆర్ తీసుకున్న అనైతిక నిర్ణయాలతో రాష్ట్రంలో ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. గతంలో కూడా హైకోర్టు ఈవిధంగా స్పందిస్తే బాగుండేదన్నారు. కాంగ్రెస్ చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్దంగా నిర్ణయాలు తీసుకుంటుందని.. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల మార్పు కేసీఆర్ వైఫల్యాలతోనే జరుగుతుందన్నారు. హరీష్‌రావు ఓవైపు, కేటీఆర్ మరోవైపు.. బీఆర్ఎస్‌ను పట్టించుకోకపోవడమే ఎమ్మెల్యేల మార్పునకు కారణమన్నారు అద్దంకి దయాకర్‌.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story