TSPSC: ‘గ్రూప్-2’పై 14న నిర్ణయం ప్రకటిస్తాం.. హైకోర్టుకు TSPSC స్పష్టీకరణ..

High Court Hearing On Group 2 Candidates Petition Over Exam Postpone
x

TSPSC: ‘గ్రూప్-2’పై 14న నిర్ణయం ప్రకటిస్తాం.. హైకోర్టుకు TSPSC స్పష్టీకరణ..

Highlights

Group - 2: గ్రూప్‌-2 పరీక్షపై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్ 2 పరీక్షలు రీ షెడ్యూల్ లేదా వాయిదా వేయాలని అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు.

Group - 2: గ్రూప్‌-2 పరీక్షపై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్ 2 పరీక్షలు రీ షెడ్యూల్ లేదా వాయిదా వేయాలని అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే తమ నిర్ణయం ఏమిటో సోమవారం తెలుపుతామని TSPSC న్యాయవాది తెలిపారు. కచ్చితంగా నిర్ణయం ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

ఆగస్టు 2 నుండి 30 వరకు వివిధ రకాల 21 పోటీ పరీక్షలు జరుగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 29, 30 న గ్రూప్ 2 కూడా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో గ్రూప్ 2 పరీక్ష రాయడం అభ్యర్థులకు ఇబ్బంది అని వివరించారు. ప్రభుత్వం అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని కోరారు. గ్రూప్ 2 కోసం 5.5 లక్షలు మంది అప్లై చేసుకున్నారని.. ఇందులో 90 శాతం మంది పోస్ట్ పోన్ చేయాలని కోరుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. గ్రూప్ 2 రాసే అభ్యర్థులు మిగిలిన పరీక్షలు కూడా రాస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు.

తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్‌-2 పరీక్ష కోసం 5.5 లక్షలు మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ గురుకుల్ పరీక్ష కు 60 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే గ్రూప్-2 పరీక్ష కోసం ఎన్ని ఏర్పాట్లు చేశాం. 1,535 సెంటర్‌లను ఎంపిక చేశాం. పరీక్షలు జరిగే స్కూల్,కాలేజ్ లకు సెలవులు ప్రకటించాం. ఐదున్నర లక్షల మంది అభ్యర్థుల్లో.. పిటిషన్ వేసింది కేవలం 150 మంది మాత్రమే. అయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సోమవారం స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తాం అని టీఎస్‌పీఎస్సీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. దీంతో సోమవారానికి పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories