ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. బీఎల్‌ సంతోష్‌కు హైకోర్టులో ఊరట

BL Santhosh: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో బీజేపీ కీలక నేత, బీఎల్‌ సంతోష్‌కు ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 25 Nov 2022 5:41 PM IST
High Court has Stayed the SIT Notices TO BL Santhosh
X

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. బీఎల్‌ సంతోష్‌కు హైకోర్టులో ఊరట

BL Santhosh: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో బీజేపీ కీలక నేత, బీఎల్‌ సంతోష్‌కు ఊరట లభించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం జారీ చేసిన నోటీసులపై బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసు రద్దు చేయాలని లంచ్ మోషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్‌లో వాదనలు సాగాయి. విచారణ చేపట్టిన హైకోర్టు సిట్‌ జారీ చేసిన నోటీసులపై డిసెంబరు 5వరకు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story