Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో నిందితులకు బెయిల్

Arun Chilukuri
Published on: 9 March 2021 4:32 PM IST
High Court Grant Bail for all Accused in Bowenpally Kidnap Case
X

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో నిందితులకు బెయిల్ (ఫైల్ ఇమేజ్ )

Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. భార్గవ్‌‌రామ్‌‌, జగత్ విఖ్యాత్‌రెడ్డితోపాటు మొత్తం ఆరుగురు నిందితులకు షరతులతో బెయిల్ ఇచ్చింది. భార్గవ్‌‌రామ్‌ తల్లిదండ్రులు కిరణ్మయి, నాయుడుతోపాటు మరో ఇద్దరు నిందితులు సిద్ధార్ధ్, మల్లికార్జున్‌రెడ్డికి హైకోర్టు కండీషనల్‌ బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న భూమా అఖిల ప్రియ అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

హఫీజ్‌పేట భూముల వ్యవహారంలో వీరంతా కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్టు పోలీసులు నిర్ధారించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత రెడ్డి, భార్గవ్ రామ్ తల్లిదండ్రులు కిరణ్మయి, నాయుడు, సిధార్థ, మల్లికార్జున రెడ్డి పరారీలో ఉన్నారు. వీరంతా హైకోర్టును ఆశ్రయించడంతో ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story